'ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయాలి'
NRML: జిల్లా కేంద్రంలో గురువారం గేట్ మీటింగ్ నిర్వహించి, సమ్మె కరపత్రాలను ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేసి, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ఈనెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తామని తెలిపారు.