కారు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి

కారు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి

ADB: జైనథ్ మండలనికి చెందిన గొడుగుల కిరణ్ తన కూతురికి చికిత్స కోసం మహారాష్ట్రలోని యువత్మల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. మంగళవారం రాత్రి వారు కారులో తిరిగివస్తుండగా ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్, అతడి కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ఘటణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.