ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: చమర్తి

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమట్టి జగన్మోహన్ రాజు అన్నారు. ఆయన శుక్రవారం కోదండ రామయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక నగరంగా తీర్చి దిద్దుతామన్నారు. కోదండ రామస్వామి ఆశీస్సులతో రాజంపేట అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.