'సరిపడా యూరియా పంపిణీ చేయాలి'
KDP: రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని రైతు సేవా సమితి మండల నాయకులు ఇసుకపల్లె శ్రీధర్ రెడ్డి ఆదివారం కోరారు. ప్రస్తుతం పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉందని రైతు సేవ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న రైతులందరికీ అందడం లేదన్నారు. జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకుని రైతులందరికీ యూరియా పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు.