VIDEO: కొండాపూర్‌లో చెరువు కాలువపై ఆక్రమణ
MBNR: నవాబుపేట మండలం కొండాపూర్ గ్రామంలో వీరసముద్రం చెరువు కాలువను కొందరు ఆక్రమించుకున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణల వల్ల తమ ఇళ్లకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయిందని తెలిపారు. అంతేకాక, ప్రభుత్వ బోరును తొలగించి ఆ గుంతను ప్రమాదకరంగా వదిలేశారని చెప్పారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని ఆక్రమణలను తొలగించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.