పశువైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది: ఎంపీ కావ్య
HNK: పశువైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని WGL ఎంపి డా. కడియం కావ్య అన్నారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం వడ్డేపల్లిలోని పశువైద్యశాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. MLA నాయిని రాజేందర్ రెడ్డితో కలసి ఎంపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశు సంపద ఎంతో విలువతో కూడుకున్నదన్నారు.