పలు మండలాల్లో సెక్షన్ 163 BNSS అమలు: సీపీ
MNCL: ఈ నెల 14న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, భీమిని, తాండూర్, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి మండలాలలో 12న ఉదయం 5 నుంచి 14న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే వరకు సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.