ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం

ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గడంలేదు. గత కొన్ని రోజులుగా అధ్వానంగా ఉన్న గాలి నాణ్యత, ఇవాళ ఉదయం కూడా 'వెరీ పూర్' కేటగిరీలో న‌మోదైంది. సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు (CPCB) ప్రకారం ఇవాళ ఉద‌యం ఢిల్లీలో AQI 355గా నమోదైంది. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంతో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.