అమెరికా స్థావరాలపై ఇరాన్‌కు రష్యా నిఘా సాయం!
అమెరికాలోని యుద్ధ విమానాలు, సైనిక స్థావరాలపై ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోందని తాజా నివేదికలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో రష్యా అందిస్తున్న ఈ నిఘా సమాచారం ఇరాన్‌కు కీలకంగా మారిందని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఈ రక్షణ సహకారం US భద్రతా ప్రయోజనాలకు సవాలుగా పరిణమించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.