పర్వతగిరిలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు

పర్వతగిరిలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు

NLG: కనగల్ మండలం పర్వతగిరి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం HM విజయ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.