అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి అచ్చెన్న
SKLM: రైతుల పక్షాన నిలిచి పక్కాగా నివేదికలు రూపొందించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని, కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.