సలేశ్వరం జాతరకు 25 ప్రత్యేక బస్సులు

సలేశ్వరం జాతరకు 25 ప్రత్యేక బస్సులు

NGKL: ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే సలేశ్వరం జాతర కోసం ఆర్టీసీ 25 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నాగర్‌కర్నూల్ డిపో నుంచి నడిచే ఈ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. పురుషులు మాత్రం నిర్ణీత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.