'ఎయిర్‌పోర్టుకు వేగంగా మౌలిక సదుపాయాలు'
VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మౌలిక వసతులను కల్పించే పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయానికి రోడ్లు, కాలువలు, విద్యుత్ వసతుల కల్పన, భూ సేకరణ తదితర అంశాలపై తమ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.