పోలీసు బందోబస్తు మధ్య ఇంటర్ పరీక్షలు
KDP: కడప జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.144 సెక్షన్ అమలులో ఉండగా, కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బందిని నియమించి కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు.