బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన అధికారులు

బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన అధికారులు

సంగారెడ్డి జిల్లా రాయికోడు మండల పరిధిలోని బీసీ హాస్టల్ ను మంగళవారం అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంజయ్య విద్యార్థులకు టెన్త్ క్లాసులో బాగా చదివి ఉన్నత విద్యను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేదార్ పటేల్, మండల ఎంపీడీవో షరీఫ్, దేవాలయ చైర్మన్ సతీష్ కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు.