ఉడా ఛైర్మన్‌ను కలిసిన జనసేన పార్టీ అధ్యక్షులు

NLR: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఉడా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జిల్లా కార్యదర్శి షేక్ అలియా, ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు, ఒంగోలు నగర నాయకులు పిల్లి రాజేష్, ముత్యాల కళ్యాణ్ ఒంగోలులో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.