20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేష్
AP: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తే సమాజంలో అన్ని సమస్యలను పరిష్కరించగలుగుతామని మంత్రి లోకేష్ అన్నారు. 'యువగళం పాదయాత్ర నన్ను చాలా మార్చింది. మన రాష్ట్రంలో నిరుద్యోగులకు కావల్సిన అవకాశాలు క్రియేట్ చేయలేకపోయామని గుర్తించాం. అందుకే బాబు సూపర్ సిక్స్ హామీల్లో.. తొలి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం' అని పేర్కొన్నారు.