కుక్కల దాడిలో రెండు గొర్రెలు మృతి
NZB: నందిపేట మండలం ఉమ్మెడ లో శనివారం వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో రెండు గొర్రె పిల్లలు మృతి చెందగా, ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద పెరిగిందని, మనుషులపై కూడా దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే గ్రామ కమిటీ సభ్యులు స్పందించి కుక్కలను కట్టడి చేయాలనీ పేర్కొన్నారు.