250 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిపివేత

BDK: వార్షిక మరమ్మతుల నేపథ్యంలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్తు కేంద్రంలో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. మరో నెలన్నర రోజుల తర్వాతే గ్రిడ్ కు ఉత్పత్తి అనుసంధానం చేయనున్నట్లు సీఈ ప్రభాకర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కర్మాగారంలో చివరిసారిగా 2021లో వార్షిక మరమ్మతులు నిర్వహించారు. అప్పట్లో రూ.36 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.