'నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి'
కర్నూలు: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహణకు నవోదయ విద్యాలయం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ప్రిన్సిపల్ ఈ.పద్మావతి మంగళవారం తెలిపారు. ఆరో తరగతిలో 80 సీట్లు ఉండగా, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి 6,469 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని ఆమె వివరించారు.