VIDEO: మహిళల ఫ్రీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం పాతపట్నం మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఫ్రీ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం ద్వారా దీనిని వెలుగులోకి తీసుకువచ్చారని వివరించారు.