భారీ వర్షాల్లో ఆర్మీ అందించిన సేవలు అభినందనీయం

MDK: జిల్లాలో గత రెండు రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాలలో సేవలందించడానికి వచ్చిన ఆర్మీ సిబ్బంది సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్మీ సిబ్బందిని ప్రశంసించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కృషి చేశారని తెలిపారు.