సచివాలయంలో కలెక్టర్ తనిఖీలు
ప్రకాశం: పన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్ను వసూలు గణనీయంగా తగ్గిందని ఆమె అన్నారు. అదే విధంగా పట్టణంలోని 16 సచివాలయంలో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.