దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి సెంటర్ నుంచి కంకిపాడు బస్టాండ్ వరకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బుధవారం స్వయంగా బస్సు నడిపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు రాష్ట్రమంతా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం కల్పించి, దివ్యంగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు.