VIDEO: పొంగి ప్రవహిస్తున్న వాగు

VIDEO: పొంగి ప్రవహిస్తున్న వాగు

RR: చేవెళ్లలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని కుమ్మెర గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఉన్న వాగు పొంగి ప్రవహిస్తోంది. వాగులోని నీరు బ్రిడ్జి మీద నుంచి ఉధృతంగా పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచించారు.