VIDEO: బావాజీపేట వద్ద లారీలు నిలిపివేత
SKLM: ఆమదాలవలస మండలం దూసి, తోటాడ ఇసుక ర్యాంప్ నుంచి వస్తున్న ఇసుక లారీలను బావాజీపేట గ్రామం వద్ద ఆదివారం గ్రామస్తులు, యువత నిలిపివేసి ఆందోళన చేపట్టారు. లారీలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల రహదారి దెబ్బతిని పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని, దీనివల్ల పిల్లలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.