ఇరాన్ దాడి.. అమెరికా సైనికులు మృతి

ఇరాన్ దాడి.. అమెరికా సైనికులు మృతి

కువైట్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న షువైబా ఓడరేవు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక సైనిక కార్యకలాపాల కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మృతి చెందారు. వారిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా.. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.