కళాశాలను ప్రభుత్వమే నడపాలి: SFI

KRNL: ఆదోని శివారు ఆరెకల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆర్ట్స్ కళాశాల రోడ్డుపై ధర్నా చేపట్టి, పీపీపీ విధానాన్ని రద్దు చేసి కళాశాలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.