కుక్కల దాడిలో పలువురికి తీవ్ర గాయాలు

కుక్కల దాడిలో పలువురికి తీవ్ర గాయాలు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని చింతలపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం వీధి కుక్కల దాడిలో పలువులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మూడు సంవత్సరాల బాలుడు, నిండు గర్భిణితో సహా పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామాలలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.