గణేష్ ఉత్సవాల్లో అపశృతి

వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం వద్ద కమాన్ అలంకరణ చేస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురై బీహార్‌కు చెందిన ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రమాదానికి గురైన ఇద్దరినీ స్థానికులు హుటాహుటిన వేములవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.