ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే
HNK: పరకాల మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన సొంతింటి కల నెరవేర్చే అవకాశం రావడం నా అదృష్టమని వారు అన్నారు. గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు.