కుక్కల దాడిలో గొర్రెలు మృతి

SRPT: హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలో ఇవ్వాళ కుక్కల దాడిలో కీత గురులింగం అనే రైతుకు చెందిన 8 గొర్రెలు మృతి చెందాయి. దొడ్లో తోలిన గొర్రెలను కుక్కలు దాడి చేసి చంపేశాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, కుక్కలను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.