నాగన్న తాత ఆలయ నిర్మాణానికి విరాళం

నాగన్న తాత ఆలయ నిర్మాణానికి విరాళం

KRNL: ఆదోని మండలం అరేకల్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో జెల్లీ నాగన్న తాత ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ పుణ్యకార్యానికి గ్రామస్తులు ఉదారంగా విరాళాలు అందిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి అరేకల్‌కు చెందిన ఈ. దేవేంద్ర గౌడ్ కుమారులు నాగరాజు, దొరస్వామి శనివారం రూ.51 వేల విరాళాన్ని సమర్పించి తమ ఆధ్యాత్మిక సేవాభావాన్ని చాటుకున్నారు.