అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు: MRO

అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు: MRO

ASF: పెంచికల్ పేట్ మండలంలో అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని MRO తిరుపతి ప్రకటనలో హెచ్చరించారు. ఒక ట్రాక్టర్ ఇసుకకు రూ. 1400 చెల్లించి కార్యాలయంలో టోకెన్ పొందాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కార్యదర్శి నివేదికతో ఉచిత ఇసుక టోకెన్ ఇస్తారన్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.