VIDEO: ఊరేగింపులో విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

VIDEO: ఊరేగింపులో విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

JGL: కోడిమ్యాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో స్వామివారి ఊరేగింపులో ఉత్సహాంగా నాగరాజు–మమత దంపతుల కూతురు మధుశ్రీ(11) నృత్యాలు, కోలాటాల వేసింది. అనంతరం ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆలయం ప్రాంగణం విషాదచాయలు అలుముకున్నాయి.