రేపటి నుంచి శ్రీ సీతారామాంజనేయ స్వామి వార్షికోత్సవాలు
RR: షాద్‌నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలోఈ నెల 28వ తేదీ నుంచి వార్షికోత్సవ పూజలు ప్రారంభం కానున్నాయని దేవాలయం కమిటీ సభ్యులు తెలిపారు. స్వామి వారి అభిషేకం, హోమం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.