బాలికల గురుకులంను పరిశీలించిన కలెక్టర్

బాలికల గురుకులంను పరిశీలించిన కలెక్టర్

MDK: వెల్దుర్తి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గురుకులంలోని కిచెన్, స్టోర్ రూమ్, విద్యార్థులు తరగతి గదులను పరిశీలించారు. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రతను పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారంపై ఆరా తీశారు.