అదనపు బాధ్యతలు చేపట్టిన అధికారి

PLD: అమరావతి మండల విద్యాశాఖ అధికారి-1గా కె.ఎస్.ఎన్. ప్రసాద్ ఇవాళ అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుంటూరు SPKH ప్రభుత్వ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన అమరావతి మండల విద్యాశాఖ అధికారి పదవికి నియమితులయ్యారు. ఈ ´ సందర్భంగా అధికారులు, సహఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ప్రసాద్ తెలిపారు.