'ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ కిట్స్ పంపిణీ చేస్తాం'

'ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ కిట్స్ పంపిణీ చేస్తాం'

ASF: జిల్లా విద్యా శాఖ సైన్స్ అధికారి కటకం మధుకర్ నేతృత్వంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు డ్రీమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ట్రస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది 50 ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ కిట్స్ పంపిణీ చేస్తామన్నారు. కెరీర్ గైడెన్స్‌, జీవన నైపుణ్యాలు, టీచర్లకు ప్రయోగాల బోధనలో శిక్షణ ఇస్తున్నామన్నారు.