హింసా రాజకీయాలను వైసీపీ నేతలు మానుకోవాలి: ఎమ్మెల్యే
NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం తమ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఏబీఎన్–ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడులు అంటే ప్రజాస్వామ్యంపై దాడులే అని అన్నారు. హింసా రాజకీయాలను వైసీపీ నేతలు మానుకోవాలని కోరారు. ఇటువంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.