స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అపశృతి

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అపశృతి

AP: నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుండగా తెప్ప కూలిపోయి నీటిలో మునిగిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు తెప్ప మీదికి రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయ కమిటీపై ఏర్పాట్ల విషయంలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.