ఘోర రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి

ఘోర రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి

HYD: హబ్సిగూడ ఫైర్‌స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న యువకుడు పిల్లర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.