ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

MHBD: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో నిత్యం ఎదురవుతున్న ఇబ్బందులు సమస్యలపై వైద్యులతో చర్చించారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి కలెక్టర్ సూచనలు చేశారు.