యూరియా కోసం రక్తం చిందిస్తున్న రైతన్నలు

యూరియా కోసం రక్తం చిందిస్తున్న రైతన్నలు

WGL: యూరియా వేయకపోతే పంట ఆగమవుతుందేమోనని భయంతో ఉమ్మడి వరంగల్ రైతన్నలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. MHBD(D) మరిపెడ(M) మల్లమ్మ కుంటతండాకు చెందిన రైతు లక్కా యూరియా కోసం క్యూలో నిలబడి సోమ్మసిల్లి కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. గూడూరు(M) లక్ష్మీపురానికి చెందిన రైతు బిచ్చనాయక్ యూరియా కోసం 40KM దూరం నుంచి కురవి(M) చింతపల్లికి వచ్చి తిరుగు ప్రయణంలో గాయపడ్డాడు.