కుకింగ్ మాస్టర్ లింగయ్య సర్పంచ్

కుకింగ్ మాస్టర్ లింగయ్య సర్పంచ్

SRPT: రాజకీయ అనుభవం లేకున్నా, పీపానాయక్ తండా సర్పంచ్‌గా గుగులోతు లింగయ్య విజయం సాధించడం సంచలనం రేకెత్తించింది. గత పదేళ్లుగా వివాహాది శుభకార్యాలకు వంట మాస్టర్‌గా పనిచేస్తున్న లింగయ్యకు గ్రామస్థుల బలవంతం మేరకు బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేయాల్సి వచ్చింది. అనూహ్యంగా సర్పంచ్ పదవి దక్కడంతో ఆత్మకూరు మండలంలో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.