నామినేషన్ కేంద్రాల తనిఖీ

నామినేషన్ కేంద్రాల తనిఖీ

MNCL: దండేపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. శుక్రవారం ఆయన మండలంలోని కొరివి చెల్మ, జెండా వెంకటాపూర్, ద్వారక, లింగాపూర్ గ్రామాలలో ఉన్న నామినేషన్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచన చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.