'ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలి'

మేడ్చల్: కూకట్‌పల్లిలోని గణేష్ మండపాలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ బండి రమేష్ మంగళవారం సందర్శించారు. ప్రశాంత్ నగర్, కైతలాపూర్‌లలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏకదంతుడి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలన్నారు.