ALERT: ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లకండి
TG: భాగ్యనగరంలో ఇవాళ శ్రీరామనవమి శోభాయాత్ర సందడి నెలకొననుంది. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు సాగే యాత్ర దృష్ట్యా పోలీసులు 12 గంటల పాటు(9AM-9PM) ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యాత్ర జరిగే మార్గంలో వాహనాలకు నో ఎంట్రీ. సీతారాంబాగ్, భోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. సిటీ వాసులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసుల సూచించారు.