కాణిపాకంలో ఆది శంకరాచార్యుల జయంతి

కాణిపాకంలో ఆది శంకరాచార్యుల జయంతి

TPT: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో శుక్రవారం ఆదిశంకరాచార్యుల జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైభవంగా పూజలు నిర్వహించారు. ఆది శంకరాచార్యుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి, వారి గురించి ఉపన్యాసం ఇచ్చారు. దేవస్థానం ఈవో పెంచల కిశోర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు పాల్గొన్నారు.