వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆయన నియంత్రణ కోల్పోయారు. అదుపుతప్పిన ఆ కారు ఎదురుగా ఉన్న పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌కు గుండెపోటు రావడం వల్లే ఈ భారీ ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు.